22 July, 2026 | 2:22 AM

60 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్‌ఓలకు అందజేసిన ఓటర్లు

22-07-2026 12:57 AM

ఘట్‌కేసర్, జూలై 21 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని ఈడబ్ల్యూఎస్  కాలనీ, బాలాజీ నగర్, గాంధీ నగర్ లోని పలు బూత్ లలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటర్లు 60 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్‌ఓ లకు అందజేశారు. బిఎల్‌ఎ లు, బి ఎల్ వో లు సమన్వయంతో పనిచేసి మిగిలిన 8 రోజులలో సర్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభాకర్ రెడ్డి సూచించారు.

ఈకార్యక్రమంలో  ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, సమన్వయ కర్తలు జాన్ పాషా, సాయికిరణ్ , ఏఈఆర్‌ఓ వేణుగోపాల్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్. మచ్చేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు కడపోళ్ల మల్లేష్, కుతాడి రవీందర్, రైతు సనన్వయ మాజీ మండల అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, మీసాల సుధాకర్ రావు, మున్సిపల్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు, సెక్రటరీ శశిధరన్, నాగభూషణంచారి, గోరకంటి రవీందర్, బిఎల్‌ఎ లు సార శ్రీనివాస్ గౌడ్, శివరాత్రి సురేష్, తదితరులు పాల్గొన్నారు.