22 July, 2026 | 2:50 AM

వర్షాలు కురిపించు దేవుడా..

22-07-2026 02:20 AM

పుణ్యక్షేత్రాలలో వరుణ పూజలు    

కరీంనగర్, జూలై21(విజయక్రాంతి): తె లంగాణలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యం లో రైతులను ఆదుకోవడానికి, సకాలంలో వానలు కురవాలని కోరుకుంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆలయాల్లో వరుణ యాగాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు , వరుణ యాగం నిర్వహించారు.

ఎల్ నినో ప్రభావం తో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితు లు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, దేవాదాయ శాఖ ఆదేశాల మే రకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం స్థానాచారి కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉ ప ప్రధాన అర్చక చిరంజీవి ,మారుతి ప్రసా ద్, చిన్న రాము వేద పండితులు రాజేశ్వర శర్మ ,పెద్దన్న శర్మ ,తేజ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా వరుణ జపం, వరుణ యాగం ని ర్వహించారు.

ఈ సందర్భంగా ఆంజనేయస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు అనుకూలంగా సకాలంలో స మృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వేద మంత్రోచ్చారణల మధ్య వ రుణ జపం, వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కార్యక్రమంలో దేవస్థాన కా ర్యనిర్వహణాధికారిఎస్. అంజనారెడ్డి, సహా య కార్యనిర్వహణాధికారి (ఏఈఓ) హరిహారనాథ్, సూపరింటెండెంట్లు సునీల్, చంద్రశే ఖర్తో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.ఇతర దేవాల యాల్లో శంకరపట్నం మండలంముత్తారం గ్రామంలో వర్షాల కోసం కప్పకు జలాభిషేకాలు చేస్తూ, ప్రజలు ’వానలు పడాలి’ అని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు.కరీంనగర్ లో పంచముఖ హనుమందీశ్వర స్వామి ఆలయంలో 108 కలశాలతో వేదపండితుల ఆధ్వర్యంలో వరుణ యాగం చేపట్టారు.