14 July, 2026 | 7:16 PM

Breaking News

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •  

వైజయంతి ఐపీఎస్ ఈజ్ బ్యాక్

25-06-2024 12:05 AM

టాలీవుడ్ ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తుకొచ్చే పేరు విజయశాంతి. ప్రస్తుత సీనియర్ హీరోల సరసన ఆడిపాడిన ఆమె ఒకానొక సందర్భంలో తన కోస్టా ర్లకు దీటైన పోటీ ఇచ్చారు. విజయశాంతి అలా హీరోలతో సమానంగా ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకోవడానికి కారణమేదైనా ఉందం టే.. గ్లామర్ హీరోయిన్‌గానే కాక యాక్షన్ కథానాయికగానూ రాణించడమే. 1990లో వచ్చిన ‘కర్తవ్యం’ సినిమాలో ఐపీఎస్ వైజయంతి పాత్రలో సగటు ప్రేక్షకులను మెప్పించింది ఈ రాములమ్మ.

అయితే ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత అదే వైజయంతి ఐపీఎస్ పాత్రలో మరోమారు కనిపించబోతోందామె. 2020లో ‘సరిలేరు నీకెవరు’తో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ దాదాపు ఈ మూడేళ్ల కాలంలో మరో సినిమా చేయలేదు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. సోమవారం విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేశారు.

‘వైజయంతీ ఐపీఎస్.. తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యూనిఫాంకు పౌరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం.. నేనే తన సైన్యం..’ అంటూ కల్యాణ్ రామ్ చెప్పిన వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోం ది. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్ర లు పోషిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కానందున ‘ఎన్‌కేఆర్21’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుం డగా, అజనీశ్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. డీవోపీ రామ్‌ప్రసాద్ కాగా, శ్రీకాంత్ విస్సా స్క్రీన్‌ప్లేలో సహకారం అందిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి తాజా గ్లింప్స్‌లో రాములమ్మ డైనమిక్ లుక్ అభిమానులకు కనుల విందుగా మారింది.