14 July, 2026 | 6:47 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

నా హృదయం అక్కడే ఉంటుంది

25-06-2024 12:05 AM

ఓ వైపు ‘సూసేకి..’ అంటూ ‘పుష్ప’తో తన అనుబంధాన్ని పంచుకుంటున్న రష్మిక, తాజాగా ‘సికందర్’ సరసన నటించేందుకు కూడా సన్నద్దమైంది. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా రూపొం దుతున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో పాటు ‘రెయిన్‌బొ’, ‘ఛావా’ కలుపుకుని మొత్తంగా అరడజను సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక మందన. చేతిలో ఇన్ని సినిమా లు ఉంటే సొంత గూటికి, ఇంటి మనుషులకి ఎంత దూరం గా ఉండాల్సివస్తుంది..? ఇదే విషయాన్ని తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది రష్మిక. కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన ఆమె ఇటీవల స్నేహితురాలి వివాహానికై తన స్వస్థలానికి చేరుకుంది. ఆ కార్యక్రమానికి అక్కడి కట్టుబొట్టుతో ముస్తాబై స్నేహితురాళ్లతో దిగిన ఫొటోలను పంచుకుంటూ “నా హృదయం, గతం కొడగులోనే ఉంటాయని” చెప్పుకొచ్చిన ఈ నేషనల్ క్రష్, తాను ఇంటిని చాలా మిస్సవుతున్నట్టు వ్యక్తపరిచింది.