27 July, 2026 | 2:57 AM

బోనం ఎత్తిన గజ్వేల్

27-07-2026 02:26 AM

గజ్వేల్ మహంకాళిని దర్శించుకున్న ఎంపీ రఘునందన్ రావు

గజ్వేల్ జులై 26: గజ్వేల్ మహంకాళి బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణ మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, కమిషనర్ గణేష్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోతరాజుల విన్యాసాలతో తరలివచ్చిన బోనాల ఊరేగింపు అందరిని ఆకర్షించాయి.

గజ్వేల్ మహంకాళితో పాటు, రేణుక ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పద్మ భాయి నర్సింగరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, గాడి పల్లి భాస్కర్, కౌన్సిలర్లు బొగ్గుల సురేష్, పోచయ్య, అత్తెల్లి  శ్రీనివాస్, గుంటుకు లక్ష్మి  శ్రీనివాస్, సత్యలక్ష్మి యాదగిరి, జరా కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.