2 May, 2026 | 3:41 AM

ఆర్టీసీ సమ్మె కాలానికి వేతనం

02-05-2026 02:27 AM
  1. కేసుల ఎత్తివేతకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  2. పీఆర్సీ అంశాన్ని పరిష్కరిస్తాం 
  3. ఆర్టీసీ హక్కులను ప్రభుత్వం కాపాడుతుంది  
  4. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్‌ను కూడా తగ్గించం 
  5. గాజులరామారంలో 100.. బహదూర్‌గూడలో 150 ఎకరాల్లో బస్ టెర్మినళ్లు 
  6. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో సీఎం 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి) : గుర్తింపు ఎన్నికలు, విలీనంపై సమగ్ర కార్యాచరణతో రావాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు ముఖ్యమ్రంతి రేవంత్ రెడ్డి సూచించారు. పీఆర్సీ అంశాన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థగా  నిలిచిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మిక సంఘాలతో శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమావేశం అయ్యా రు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించారు. 

ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనంతో పాటు కేసులు కూడా ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో సీఎం నిర్ణయానికి ఆర్టీసీ కార్మికుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ .. సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సేవలు అందించ డానికి కార్యాచరణ  కోసం ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. ‘నేను వేరు, మీరు వేరు అన్న భావన నాకు ఎప్పుడు లేదు..  అందరం కలిస్తేనే ప్రభు త్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేం ఉన్నాం.

ఆర్టీసీలో బస్సులను పెంచాం, నియామకాలు పెంచాం, ఆదాయం పెంచాం’ అని సీఎం వివరించారు. ‘గాజులరామారంలో  బస్ టర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించాం. శంషాబాద్‌లో బహదూర్ గూడలో  150 ఎకరా ల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మిస్తాం. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నాం.  మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందజేయాలనుకుంటున్నాం. డీజీ ల్ పైన ఆర్టీసీ ప్రతి యేడాది రూ. 2000 కోట్లు ఖర్చు చేస్తుంది. 

డీజీల్ ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ బస్సులను తీసుకురా వాలి. ఆదాయం పెరగాలం టే ఖర్చు తగ్గించుకోవాలి.  దీని కోసం పక్కా ప్రణాళిక కావాలి.  ఆర్టీసీలో బకాయిలు మా హ యాంలో పెట్టినవి కావు.   కాని వాటిని క్లియ ర్ చేయడా నికి ప్రయత్నం చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న  కారుణ్య నియామాలను చెపట్టాం.  ఆర్టీసీ సమస్యలు ఏవైనా నా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించాను.’ అని  సీఎం పేర్కొన్నారు . 

యూనియన్లపై కార్మిక సంఘాలే చర్చించుకోవాలి.. 

యూనియన్లు, విలీనం లాంటి అంశాలపైన ప్రణాళికాబద్దంగా కార్మిక సంఘాలే  చర్చించుకుని నిర్ణయం చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.  ఆర్థిక అంశాలతో కూడా పీఆర్సీ లాంటి పైన ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంటుందని,  శాశ్వత పరిష్కారం కోసం చర్చించుకుని ప్రభుత్వం ముందు ఆప్షన్స్ పెట్టాలన్నారు.  రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుం దని,  ఆర్టీసీ అప్పులపైన ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం  ప్రయత్నాలు చేస్తుందన్నారు. 

సంస్థలను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడానికి కార్మికులు సహక రించాలన్నారు.  ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ ను కూడా తగ్గించం.. డీజీల్ ఖర్చు తగ్గించడానికే ఈవీ బస్సును ప్రోత్సహిస్తున్నామని,  మహాలక్ష్మి పథకం పెట్టడం ద్వారా 8 వేల కోట్ల రూపాయలను ఆర్టీసీకి ఇచ్చామని సీఎం తెలిపారు. ఆర్టీసీ ని బాగు చేసుకునే అవకాశం కార్మికులపైనే ఉందన్నారు. కార్మికులు, డిపో మేనేజర్ల మధ్య గ్యాప్ రాకుండా అధికారులు చూడాలని,  ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి ఉద్యోగుల బకాయిలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సారి ఉద్యోగులకు 1000 కోట్ల బకాయిలు విడుదల చేసినట్లు సీఎం చెప్పారు. 

ఈ సమా వేశంలో  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యే లు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజ్, ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితో పాటు 14 కార్మిక సంఘాల నాయకులు థామస్‌రెడ్డి, ఆశ్వథామరెడ్డి, శంకర్, వీరాంజనేయు లు, వీఎస్‌రా వు, ఎస్ బాబు, ఈ. వెంకన్న, కమల్‌రెడ్డి, ఎంకే బోస్, బి. యాదగిరి, జి. అబ్రహం, మొగుళ్ల రాజిరెడ్డి, బి.యాదయ్య, మునిరాములు, కె. యా దయ్య, కె. సత్యనారాయణరెడ్డి, ఎండీ అక్బర్‌అలీ, కె. మనోహ ర్‌రావు, ఈ. స్వామికుమార్, హరిషన్, గోవింద్, డీవీకే రావు, కె. హనుమంతు ముదిరాజ్, దువ్వాసీ యాదయ్య, సుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు