తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి 4 ప్రతిపాదనలు
- ఐఐటీ, హైదరాబాద్ ఆర్వీ అసోసియేట్స్ నిపుణులతో ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్ల పరిశీలన
- ప్రాణహిత-- పునరుద్ధరణకు చర్యలు
- మహారాష్ట్రలో ముంపు తగ్గింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు
- ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శనం మేరకు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌లకు మరమ్మతులు
- ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన చేవెళ్ల వద్ద బరాజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు గాను తుమ్మిడిహట్టి వద్ద నిర్మించ తలబెట్టిన బరాజ్ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్ వారిని ఆయన ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలకు అనువైన పద్ధతిలో ఉండేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించడంతోపాటు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలు అం శంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖా సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, ఈఎన్సీ రమేష్ బా బు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మహారాష్ట్రలోనీ భూభాగంతో పా టు చప్రాల వన్యప్రాణుల అభయారణ్యం లో ముంపు ప్రభావం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.
ముంపు ప్రభావిత ప్రాంతాలకు అవసరమైతే నష్ట పరిహారాన్ని చెల్లించేందుకు తెలం గాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ తక్కువ వ్యయంతో వరద నీటి ప్రవాహాన్ని వినియోగించేలా నిర్మాణం చేపట్టేలా మార్గాలు చేప ట్టాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు సమగ్రంగా అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు.
తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి గాను అంతర్ రాష్ట్ర చర్చలకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలు, సాధ్యాసాధ్యాలు, ఖర్చు చేసే మొత్తంతో ఓనగూరే ప్రయోజనాలతో పాటు భూగర్బానికి సంబంధించిన సాంకేతిక వివరాలతో పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి, అక్కడి నుంచి సుందిళ్ల వరకు అనుసంధానానికి నాలుగు ప్రత్యామ్నాయ అలైన్మెంట్ ప్రతిపాదనలను ఐఐటీ హైదరాబాద్ నిపుణులు, ఆర్వీ అసోసియేట్స్‌లో కలిసి సవివరంగా పరిశీలిస్తున్నారన్నారు. భూసేకరణ తగ్గించడం, పంపింగ్ అవసరాన్ని తగ్గించడం, టన్నెల్‌లు, కాలువల పొడవు తగ్గించడం, మొత్తం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడం ఈ అధ్యయనాల ప్రధాన లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు.
అందుకుగాను తుమ్మిడిహట్టి ప్రాంతంలో భూగర్భ, భౌగోళిక సర్వేలు కూడా వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాం గ్రెస్ ప్రభుత్వం హయాంలో రూపుదిద్దుకున్న చేవెళ్ల ప్రాజెక్టును గోదా వరి ఉపనది ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి వరద కాలువ లతో సాగునీరు సరఫరా చేయడంతోపాటు అవసరమైన చోట ఎత్తిపోతల పధకాలు నిర్మించి ఎగువ ప్రాంతాలకు మళ్లించేలా ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
దీని ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఎల్లంపల్లి జలాశయాలతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతాల వరకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించిందన్నారు. తక్కువ వ్యయంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకుందన్నారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ డిజైన్‌ల పేరుతో అకారణంగా కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు నిర్మించినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదన్నారు.
ప్రాజెక్టు పరిధి విస్తరించినప్పటికీ ఎత్తిపోతలపై ఆధారపడడంతో విద్యుత్ చార్జీలు పెనుభారంగా పరిణమించిడంతో పాటు భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయట పడడంతో వరద కాలువల ద్వారా లభించే ప్రయోజనాలు నెరవేరక పోగా రంగారెడ్డి జిల్లా చివరి ప్రాంతాలకు ఎంతమాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. చేవెళ్ల- పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యే ప్రసక్తే లేదన్నారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ. 11,000 కోట్లు ఖర్చు పెట్టి 71.5 కిలో మీటర్లు దూరం కాలువ తవ్వకాలు హెడ్ వర్క్ నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం ఉన్న మౌళిక సదుపాయాలను సాధ్యమైన మేర వినియోగించుకుంటు తక్కువ వ్యయంతో ఎల్లంపల్లి నుండి వరద కాలువ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు దృష్టి కేంద్రీకరించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వర్షాకాలానికి ముందే అత్యవసర మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ఈ పనులు ఎన్‌డీఎస్‌ఏ సాంకేతిక మార్గదర్శకత్వంలో కొనసాగనున్నాయని ఆయన తెలిపారు. ఈ మరమ్మతుల కోసం ప్రతి 1.5 మీటర్లకు ఒకసారి స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్, ప్రతి 3 మీటర్లకు ఒకసారి పర్మియబిలిటీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాతి పొర తగిలిన తర్వాత కూడా మరింత లోతుగా డ్రిల్లింగ్ చేయాలని సూచించారు. ఇందుకోసం సమన్వయ కమిటీ వెంటనే ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించి, పనులకు స్పష్టమైన కాలపట్టిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రా జెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భారీ ఎత్తిపోతల ఆధారిత విధానంతో పోలి స్తే తక్కువ నిర్వహణ వ్యయంతో విశ్వసనీయంగా సాగునీరు అందించే అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు..






