నడకలు నేర్చిన నాట్యమిదీ
11-06-2024 02:32 AM
శిల్పకళావేదిక మరో కన్నుల విందైన కమనీయ కార్యక్రమానికి వేదిక అయ్యింది. చిరంజీవులు త్రిఖ, మిష్కల అద్భుత కూచిపూడి నాట్యంతో ఓలలాడింది. లబ్ధప్రతిష్టులైన ప్రముఖల సమ క్ష్యంలో త్రిఖ, మిష్కల రంగప్రవేశ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. జ్యోతిరెడ్డి శిష్యరికంలో కూచిపూడిని అవపోసన పట్టిన ఈ ఇద్దరి నాట్య భం గిమలు, అందుకు అనుగుణంగా ప్రదర్శించిన హావభావాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. కేవీ రమణాచారి, ఐఏఎస్ బుర్రా వెంకటేశం, సినీ హీరో సుమన్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఏపీ విశ్రాంత సీఎస్ కాకి మాధవరావు తదితర ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఆసాంతం అద్భుతంగా సాగింది.






