నీట్ పరీక్షను రద్దు చేయాలి
పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): నీట్ పరీక్షలో అవకతవ కలు జరిగాయని, అందులో బీజేపీ హస్తం ఉందని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ పేర్కొ న్నారు. పరీక్షను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గుజరాత్‌కు చెందిన పర్శరామ్‌రాయ్, తుషా కలిసి 16 మంది దగ్గర రూ. 10 లక్షలు తీసుకుని పరీక్షలు రాయించారని విమర్శించారు.
ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ శుభోద్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడి యాతో మాట్లాడుతూ.. ఒకే సెంటర్‌లో 8 మంది విద్యార్థులకు గరిష్ట మార్కులు రావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక ప్లాన్ ప్రకారమే వారందరికి ఒకే గదిలో సీరి యల్ నెంబర్ వచ్చేలా చేశారన్నారు. మెడికల్ కాలేజీలు ఎక్కువగా బీజేపీ నేతలకే ఉన్నాయన్నారు.






