18 July, 2026 | 2:13 AM

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గోడ గడియారాలు పంపిణీ

18-07-2026 02:13 AM

తాడ్వాయి, జూలై, 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతినిధులు గోడ గడియారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చిరు కానుకగా గడియారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మిగతా లబ్ధిదారులు త్వరగా ఇండ్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం, గ్రామ సర్పంచ్ కోర్ని నర్సింలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు, బాలరాజు, నరసారెడ్డి, రాంరెడ్డి, రాజాగౌడ్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.