విమాన సర్వీసులపై వార్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: విమాన సర్వీసులపై ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు(America, Israel, Iran), ప్రతిదాడుల ప్రభావం పడింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతర్ కు వెళ్లాల్సిన విమానాలు రద్దు అయ్యాయి. ఇవాళ రాత్రి11.59 గంటల వరకు విమాన సర్వీసులు(Airline services) రద్దు అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా(Air India) ప్రకటించింది. ఐరోపా దేశాలకు వెళ్లాల్సిన 6 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎక్స్ లో పోస్టు చేసింది.
దుబాయ్, షార్జా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు స్పెస్ జెడ్(SpiceJet airline) ప్రకటించింది. మరికొన్ని విమానలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విమానయాన సంస్థలను సంప్రదించాకే రావాలని ఢిల్లీ ఎయిర్ పోర్టు(Delhi Airport) ఎక్స్ లో పోస్టు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థలు ప్రస్తుతం తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. భద్రతా సమస్యల ఫలితంగా, వారు విమాన మార్గాలను మారుస్తున్నారు లేదా రద్దు చేస్తున్నారు. దీని ప్రభావం ప్రధానంగా హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) నుండి గల్ఫ్, అరబ్ దేశాలకు నడిచే సేవలపై పడింది. శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport) నుండి వివిధ అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే మొత్తం 23 విమానాలు రద్దు చేయబడ్డాయి.
అదేవిధంగా, వివిధ దేశాల నుండి హైదరాబాద్‌కు వచ్చే 21 విమానాలు కూడా రద్దు చేయబడ్డాయి. దుబాయ్, దోహా (ఖతార్), కువైట్, దమ్మామ్ (సౌదీ అరేబియా), షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్‌లకు విమానాలు రద్దు(Flight cancellations) చేయబడిన వాటిలో ముఖ్యమైనవి. విమానాల ఆకస్మిక రద్దు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. ఇతర దేశాలకు ప్రయాణించాల్సిన ప్రయాణీకులు కనెక్షన్లు(Passenger connections) తప్పిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సుదూర ప్రాంతాల నుండి వచ్చే వ్యక్తులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోతున్నారు.




