12 July, 2026 | 3:47 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

బర్త్‌డేకు ‘వార్2’ అప్డేట్!

17-05-2025 12:06 AM

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ‘వార్‌2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. కియారా అద్వాణీ కథానాయిక. తాజాగా హృతిక్.. ‘హే తారక్, ఈ ఏడాది మే 20న ఏ అప్డేట్ రాబోతోందో? అసలు ఏం జరగబోతోందో నీకు తెలుసా? నువ్వు అస్సలు ఊహించలేవు..

మీరంతా సిద్ధంగా ఉన్నారా?’ అంటూ ట్వీట్ చేయడంతో అది ‘వార్‌౨’ అప్‌డేటే తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మే 20న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారని సినీప్రియులు భావి స్తున్నారు. ఈ విషయాన్నే హృతిక్ ఇలా ట్వీట్‌తో హింట్ ఇచ్చారని అంటున్నారు.