16-05-2025 11:43:42 PM
శ్రీవిష్ణు హీరోగా, కేతికశర్మ, ఇవానా కథానాయికలుగా నటించిన సినిమా ‘సింగిల్’. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. మే 9న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూసి తర్వాత శ్రీవిష్ణుని పిలిచి గీతాఆర్ట్స్‌లో మరో రెండు సినిమాలు చేయాలని చెక్ ఇచ్చాను. మనిషిగా యాక్టర్‌గా తను అంత నచ్చాడు. విష్ణుతో నా ప్రయాణం మున్ముందు ఇంకా ఉంటుంది. తను డైలాగ్ డైలాగ్‌కి మధ్య చెప్పిన డైలాగ్ అర్థం చేసుకోవడం నావల్ల కాలేదు (నవ్వుతూ) వెన్నెల కిషోర్ ఈ సినిమాతో కొంచెం దగ్గరయ్యారు.
వ్యక్తిగత సలహాలు తీసుకోవడం దగ్గర వరకూ వచ్చింది. కేతిక, ఇవానా ఫెంటాస్టిక్‌గా పెర్ఫాం చేశారు. విద్య మా అమ్మాయి. తను ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది” అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “ఈ కథను డైరెక్టర్ కార్తీక్ రాజు నాకు మూడేళ్ల క్రితం చెప్పారు. అంతకుముందు ఈ కథను 15 మంది రిజెక్ట్ చేశారు. వాళ్లందరికీ థాంక్యూ (నవ్వుతూ). సినిమాను చాలా కసిగా చేశాం. నా కసిలో పాలుపంచుకున్న వెన్నెల కిషోర్‌కు థాంక్యూ (నవ్వుతూ). దేవుడు ఉన్నాడు.. హానెస్ట్‌గా, సిన్సియర్‌గా ఏది చేసినా దేవుడు మనకిచ్చేస్తాడు. చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థాంక్యూ. కేతిక, ఇవానా ఇంకా పెద్దపెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటున్నా” అన్నారు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ‘అల్లు అరవింద్‌తో టైమ్ స్పెండ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను.
ఆయన ప్రతి సమస్యకూ అద్భుతమైన సొల్యూషన్ ఇస్తారు. శ్రీవిష్ణుతో జర్నీ మర్చిపోలేను. ఈ సినిమా మొదటి నుంచి ఇందులో సెకండ్ హీరో మీరే అని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తి చాలా అరుదు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది” అని చెప్పారు. హీరోయిన్ కేతికశర్మ, చిత్ర దర్శకుడు కార్తీక్ రాజు, నిర్మాతలు విద్య, భాను, రియాజ్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా జర్నీ విశేషాలను ఈ వేదికపై పంచుకున్నారు. అతిథులుగా విచ్చేసిన డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, తిరుమల కిషోర్, వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి, రామ్ అబ్బరాజు, ప్రొడ్యూసర్లు ఎస్‌కేఎన్, బన్నీ వాసు ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.