6 July, 2026 | 4:04 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

యుద్ధంతో సమస్య తీరదు

23-08-2024 12:16 AM

ఇది యుద్ధ యుగం కానేకాదు

చర్చలే ఏ సమస్యకైనా పరిష్కారం

ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటన

పొలండ్ అధ్యక్షుడు, ప్రధానితో చర్చలు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఏ సమస్య కూడా యుద్ధంతో, యుద్ధభూమిలో పరిష్కారం కాదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రస్తు తం మనం ఉన్న ఈ యుగం యుద్ధ యుగం అస్సలే కాదని తేల్చి చెప్పారు. పోలండ్ పర్యటనలో ఉన్న ప్రధాని ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో చర్చలు జరిపారు. వార్సాలో ప్రవాస భారతీయుల సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌ేొరష్యా యుద్ధంతోపాటు మధ్య ఆసి యాలో ఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ‘ఏ సమస్య కూడా యుద్ధ భూమిలో పరిష్కారం కాదని భారత్ బలంగా నమ్ముతుంది. ఏ విపత్తులోనైనా సమాన్య ప్రజ లు చనిపోవటం మానవత్వానికి అతిపెద్ద సవాలు. వీలైనంత త్వరగా శాంతి సుస్థిరతలు సాధించేందుకు చర్చలు, దౌత్యమార్గాల ప్రయత్నించటాన్నే మేం సమర్థిస్తాం’ అని ప్రకటించారు. 

ఉగ్రవాదాన్ని ఉపేక్షించం

ప్రధాని మోదీకి గురువారం పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఘన స్వాగత పలికారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాల్లో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ప్రకటించారు. ఏ దేశం కూడా ఉగ్రవాదానికి స్వర్గధామంగా మారటానికి వీళ్లేదని తేల్చి చెప్పారు. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా తో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పోలండ్ పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం ప్రధాని మోదీ ఉక్రెయిన్ వెళ్లారు. 

ట్రెయిన్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణం

పోలండ్ నుంచి ఉక్రెయిన్‌కు ప్రధాని మోదీ.. విమానంలో కాకుండా రైల్లో బయలుదేరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో విమానాశ్రయాలన్నీ మూసివేయటంతో ఆయన రైల్లో వెళ్లాల్సి వస్తున్నది. అయితే మోదీ ప్రయాణిస్తున్న రైలు కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిని ట్రెయిర్‌ఫోర్స్ వన్ అని పిలుస్తారు. ఇది అత్యంత విలాసవంతమైనది.  ఈ రైలులో అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ షోల్జ్ కూడా ప్రయాణించారు.