6 July, 2026 | 3:09 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

కెనడాలో రైళ్లు బంద్

23-08-2024 12:15 AM

ఒట్టావా, ఆగస్టు 22: కెనడాకు చెందని ‘కెనాడా నేషనల్’, ‘ది కెనడా ఫసిఫిక్ కన్సాస్ సిటీ సదరన్’కు చెందిన సుమారు 9 వేల మంది కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగడంతో అమెరికా కెనడా మధ్య దిగుమతి, ఎగుమతి సేవలు నిలిచిపోయాయి. అమెరికాలోని వ్యవసాయ, ఆటోమొబైల్, గృహ నిర్మాణ, ఇంధన పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు రవాణా స్తంభించింది. దీంతో ఆయా ముడిసరుకులు అవసరమైన పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడే అవకాశం కనిపిస్తున్నది. అమెరికా కెనడా పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడడంతో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. 

అమెరికా నుంచి కెనడా సరిహద్దులకు సరఫరా అయ్యే క్లోరిన్ సైతం నిలిచిపోవడంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్వహణ కష్టతరంగా మారనున్నది. రోడ్డు మార్గం నుంచైనా అవసరమైన సరుకులు రవాణా చేసేందుకైనా తగినన్ని ట్రక్కులు అందుబాటులో లేవు. దీంతో కార్మికులు సమ్మె విరమిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించని పరిస్థితి ఏర్పడింది. అండర్సన్ ఎకనామిక్ గ్రూప్ అంచనాల ప్రకారం సమ్మె కాలంలో సుమారు 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలిసింది.