23 June, 2026 | 5:23 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •  

నేను స్థానికున్నే...

05-02-2026 01:12 AM

- ఆదరించండి..  అండగా ఉంటా

- 7వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్ సి సంతోష్ గుప్తా 

గజ్వేల్, ఫిబ్రవరి 4 : ప్రజల అమూల్యమైన ఓటును వేసి ఆదరిస్తే ఎల్లవేళలా అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్ సి సంతోష్ గుప్తా అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల నుండి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ పునరావాసులకు ఆర్ అండ్ ఆర్ కాలనీని అద్భుతంగా నిర్మించారని, మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

స్థానికత పేరుతో కొందరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తాను కూడా ఏడవ వార్డులోనే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయాల అభివృద్ధికి బోర్లు వేసి సహకరించినట్లు ఆయన తెలిపారు. ఎర్రవల్లి సింగారం గ్రామాల ప్రజలు తనకు తోడుండి ఓటు వేసి గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు పెంటా రెడ్డి, రామ్ రెడ్డి, రత్నారెడ్డి, శివకుమార్, భాస్కర్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.