calender_icon.png 5 February, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం

05-02-2026 01:10:08 AM

11వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థికి బ్రహ్మరథం  

గజ్వేల్ ఫిబ్రవరి 4: కేసీఆర్ తోనే మల్లన్న సాగర్ పునరావాస గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్థి  కొలిచేలిమి భవాని కరుణాకర్ అన్నారు. బుధవారం వార్డులోని లక్ష్మాపూర్, సంగాపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా బిఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రజల బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎక్కడ లేని విధంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టుల పరిహారాన్ని అందించారన్నారు.

పల్లె ప్రజలను పట్టణవాసులుగా మార్చి ఆర్థిక, సామా జికాభివృద్ధికి బాటలు వేశారన్నారు. ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలన్నా, సంగాపూర్ గ్రామం మరింత అభివృద్ధి చెందాలన్నా 11వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్‌ఎస్ అభ్యర్థి భవాని కరుణాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచెలిమి స్వామి, వార్డు ఇంచార్జ్ మాజీ ఎంపీపీ రాగల దుర్గయ్య, అంకిరెడ్డిపల్లి సర్పంచ్ బాలయ్య,మాజీ సర్పంచ్ శ్రీనివాస్, వెంకటేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.