రేపు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ
01-03-2026 01:43 PM
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంత పద్మనాభస్వామి డిగ్రీ కాలేజీ ఆవరణలో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటి సమావేశం జరుగనుంది. డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం.
రేపు ఉదయం 9.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకోనున్న రాహుల్ గాంధీ, అక్కడి నుంచి హెలికాప్టర్ లో వికారాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు వికారాబాద్ చేరుకొని హరిత హోటల్ లో జరిగే శిక్షణ తరగతులకు హాజరై సాయంత్రం 4.30 గంటలకు వరకు డీసీసీ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.




