12 May, 2026 | 11:43 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

వార్న్ నా ఆరాధ్య క్రికెటర్

24-08-2024 12:30 AM

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ తన ఆరాధ్య క్రికెటర్ అని టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అభిప్రా యపడ్డాడు. వార్న్ మరణంతో ఒక కుటుం బ సభ్యుడిని కోల్పోయినట్లు అనిపించిందని కుల్దీప్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న కుల్దీప్ శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా కుల్దీప్ వార్న్ విగ్రహానికి నివాళి అర్పించాడు. కుల్దీప్ మాట్లాడుతూ.. ‘షేన్ వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. నాకు అతడితో మంచి అనుబంధం ఉంది.

వార్న్ గురించి ఆలోచన వస్తే ఇప్పటికీ ఉద్వేగానికి లోనవుతా. వార్న్‌ను కోల్పోయినప్పుడు నా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్లు అనిపించింది’ అని అన్నాడు. 2022 ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లోని విల్లాలో గుండెపోటుకు గురైన వార్న్ మృతి చెందిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన కుల్దీప్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ కుటుంబంతో గడుపుతున్నాడు. త్వరలో మొదలు కానున్న దులీప్ ట్రోఫీలో గిల్ నేతృత్వంలోని ఏ ప్రాతినిథ్యం వహించనున్నాడు.