యూరోపియన్ దేశాలకు హెచ్చరికలు
అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు మద్దతు తెలపొద్దని యూరోపియన్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. తమ దేశంపై జరుగుతున్న సైనిక చర్యల్లో ఏ రకమైన జోక్యం చేసుకున్నా, ఆ జోక్యాన్ని యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దురాక్రమణదారులకు సహకరించే దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ యుద్ధం కేవలం తమ ప్రాంతానికే పరిమితం కాదని, యూరప్ దేశాలకు కూడా వ్యాపిస్తుందని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఇరాన్ చర్యలను ఖండిస్తున్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను అడ్డుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ దేశాలు ప్రకటించాయి.
దీనిపై ఇరాన్ స్పందిస్తూ తమ ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని తెలిపింది. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామన్న హెచ్చరికలతో యూరప్ దేశాల్లో ఆందోళన మొదలైంది.




