18 July, 2026 | 1:30 AM

ఆడిట్ అంతా బోగస్!?

18-07-2026 01:30 AM
  1. ప్రభుత్వ పాఠశాలల్లో కాకి లెక్కల గణాంకాలు 
  2. దొంగ లెక్కలు సమర్పణ 
  3. తనిఖీ చేస్తున్న ఆడిట్ బృందం

సుజాతనగర్, జులై 17, ( విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి నాణ్యమైన విద్య బోధన అందించాలని విద్యార్థుల సంక్షేమం కోసం పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం పాలన ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా పాఠశాలలకు విడుదలయ్యే నిధులు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో తెలియదు గానీ ఆ నిధుల వినియోగంపై భద్రా ద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఆడిట్ యంత్రాంగం ముమ్మరం చేస్తుంది.

జిల్లాలోని ఆయా మండలాల వా రీగా కేటాయించిన తేదీలలో మూడు నా లుగు మండలాలకు కలిపి ఒక ప్రాంతంలో ఆడిట్ బృందం పాఠశాల నిధుల వినియోగంపై ప్రత్యేక తనిఖీ చేపడుతుంది. ఆ ఆడిట్ బృందానికి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల వారీగా సంబంధిత ఉపాధ్యాయులు విధుల వినియోగంపై సంబం ధిత రికార్డులను సమర్పించి ఆడిట్ బృందా ల ద్వారా ఓకే అనిపించుకొని ప్రత్యేక ముద్ర వేయించుకుంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. 

ప్రభుత్వ పాదమిక పాఠశాలలు 784 ప్రాథమికోన్నత పాఠశాలలు 155 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 111 చొప్పున మొత్తం 60 వేల 25 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వార్షిక విద్యా సంవత్సరంలో పాఠశాలలను బట్టి విద్యార్థుల క్రమ సంఖ్యను బట్టి వేలాది రూపాయలను నిధులు  ప్రభుత్వం విడుదల చేస్తుంది.. ఆ విధుల ద్వారా విద్యార్థులకు అవసరమయ్యే బోధన సామాగ్రి క్రీడల పరికరాలు, టిఎల్‌ఎం మెటీరియల్ తయారీ మౌలిక సదుపాయాల కల్పన తదితర వాటికి ప్రభుత్వం ద్వారా వచ్చే విధులను నిధులను ఖర్చుపెట్టినట్లు అందుకు సాక్ష్యంగా సంబంధిత బిల్లులను ఆడిట్ బృందానికి సమర్పిస్తున్నారు.

సుమారు 16 రకాల రికార్డులను పరిశీలించిన తర్వాత ఆ నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయినట్లు ఆమోదముద్ర వేసీ ఆడిట్ బృందం తిరిగి ఉపాధ్యాయులకు అప్పచెప్పుతున్నారు. ఆడిట్ బృందం అనుమతితో ఆమోదముద్ర పొందిన పాఠశాలలు ఆ నిధుల వినియోగం మమ అనిపిస్తున్నారు.

ఆడిట్ బృందానికి సమర్పించాల్సిన రికార్డులు ఇవే...

పాఠశాలలకు సంబంధించిన క్యాష్ బుక్ వోచర్ బుక్ పిఎఫ్ ఎంఎస్ జనరేటర్ ప్రింట్ పేమెంట్ అడ్వైజ్ కాపీ, పిఏ రిజిస్టర్ బడ్జెట్ వాచ్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ రిసిప్ట్ పేమెంట్ స్టేట్మెంట్ రిజిస్టర్ విద్యార్థులకు యూనిఫామ్ కు సంబంధించిన రిజిస్టర్, తో పాటు క్రీడల పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాలకు వినియోగించిన నిధుల వివరాలు తదితర అంశాలతో కూడిన ప్రత్యేక రిజిస్టర్లు ఆర్డిటి బృందానికి బిల్లులతో పాటు సమర్పించాల్సి ఉంది.

‘ఆడిట్’ భౌతిక పరిశీలన ఏది..?

 ప్రభుత్వం పాఠశాలల బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యా బోధన కోసం ఖర్చు పెడుతున్న డబ్బులకు అది ఏ వేరకు విద్యార్థులకు ఉపయోగపడుతుందని నేరుగా ఆర్డిటి బృం దం ఆయా పాఠశాలలకు వెళ్లి పరిశీలించా ల్సి ఉంది. కానీ ఆడిట్ బృందం ఒకే చోట కూర్చొని ఉపాధ్యాయులు సమర్పించిన రి కార్డులను సరిచూసి ఆమోదం తెలుపుతున్నానే తప్ప పూర్తిస్థాయిలో పరిశీలనకు ఏ ఒ క్క పాఠశాలను కూడా పరిశీలన చేయడం లేదు.

ఆడిట్ బృందం పరిశీలనలో లేకపోతే విద్యార్థులకు ఆ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది ప్రభుత్వానికి నేరుగా తెలియడం లేదు. నిధుల వినియోగంపై కొంద రు ఉపాధ్యాయుల జేబుల్లోకి నేరుగా వెళ్తున్నాయి. ఆడిట్ బృందాన్ని బురిడీ కొట్టించా లని ఉద్దేశంతో హడావుడిగా దొంగ బిల్లు లను సమర్పించి ఆడిట్ కు ఆమ్యాన్యాలతో సరిపెడుతూ ఆడిట్ పరిశీలనను దాటవేస్తున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఆడిట్ బృందానికి సమర్పించిన బిల్లులను పరిశీలిస్తే విద్యార్థులకు ఏ విధమైన ఉపయోగపడుతుందని స్పష్టం అవుతుంది.

ఇప్పటికై నా ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు చే స్తున్న నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు పెట్టాల ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఆడిట్ బృందాలను నేరుగా పాఠశాలలకు వెళ్లి పరిశీలించా లని తల్లిదండ్రులు కోరుతున్నారు.