16-02-2026 07:20:44 PM
టిబిజికెయస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి
మణుగూరు,(విజయక్రాంతి): ఏరియాలోని కార్మికులు విధులకు రాకపోకలు సాగించే రహదారి వెంబడి చెత్త, చెదారం అపరిశుభ్రమైన వ్యర్థాలను తొలగించాలని టిబిజికెయస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... రహదారులపై వ్యర్ధాలను వదలడంతో ఆ దుర్వాసనలకు రహదారి వెంబడి కుక్కలు పందులు చేరి కార్మికులు రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ముత్యాలమ్మ నగర్ పంచాయతీ పాలకులు దృష్టి సారించి గ్రామాల వ్యర్థాలను రహదారి వెంబడి విడవకుండా తగు చర్యలు చేపట్టి కార్మికుల ప్రాణాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
నైట్ షిఫ్ట్ విధులకు హాజరు అవుతూ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిహెచ్పి కన్వేయర్ ఆపరేటర్ మల్లంపాటి సాంబశివరావును పరామర్శించి, ప్రమా దానికి గల కారణాలు అడిగి తెలుసుకు న్నారు. ముత్యాలమ్మ నగర్ వైకుంఠ ధామం వెంబడి చెత్త, చెదారం అపరిశు భ్రమైన వ్యర్థ పదార్థాలు వదులుతున్న వాహనాలను గుర్తించి పంచాయతీ అధికారులు వాటిని సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డు లకు ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఉపయోగించుకోకుండా రహదారి వెంబడి వ్యర్ధాలు వదలడం వల్ల కుక్కలు పందులు చేరి కార్మికులు రోడ్డు ప్రమాదా లకు గురిఅవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి వెంబడి వ్యర్ధాలను వదలకుండా సంబంధిత పంచాయతీ అధికారులు దృష్టి సాధించాలని, సింగరేణి యాజమాన్యం కూడా తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. కార్య క్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు, సుద్దా ల సంపత్ కుమార్, దిశెట్టి రమేష్, పీకే నాగరాజు, చిరుత వెంకటేశ్వర్లు, ఇజ్రా యిల్,రమేష్ నాయక్, కళ్యాణ్, సర్వే నరేష్, రేవన్ కుమార్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.