వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్
- శంకర్‌పల్లిలో ఏర్పాటు చేసిన వైల్డ్ వాటర్స్
- ప్రారంభించిన హిరోయిన్ ఫరియ అబ్దుల్లా
హైదరాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): వైల్డ్ వాటర్స్ భారతదేశంలో తొలిసారిగా వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఇమర్సివ్ 360ఓ డోమ్ సమ్మర్ ఫెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా శంకరపల్లిలో ప్రారంభించారు.వైల్డ్ వాటర్స్ వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ తన ఇమర్సివ్ 360ఓ డోమ్ అనుభవాన్ని ప్రారంభిం చినట్లు ప్రకటించింది. ఈ డోమ్‌ను ప్రముఖ నటి ఫారియా అబ్దుల్లా (జాతి రత్నాలు) అధికారికంగా ప్రారంభించారు, ఈ కార్యక్రమం లో ఎండీ కిలారు సందీప్, కిలారు అదితి పాల్గొన్నారు.
కృష్ణ సందీప్ కిలారు, స్వాతి కిలారు స్థాపించిన వైల్డ్ వాటర్స్, గత 9 సంవత్సరాలుగా ప్రతి సీజన్‌లో కొత్త వినోదాలను అందిస్తూ హైదరాబాద్‌లో ప్రముఖ వినోద కేంద్రంగా ఎదిగింది.ఈ సందర్భంగా ఎండీ కిలారు స్వాతి మాట్లాడుతూ ఈ డోమ్‌లో గోడలు, పైకప్పు మొత్తం ఒకే స్క్రీన్‌లా పనిచేస్తూ, సరౌండ్ సౌండ్‌తో కలిసి సందర్శకులకు పూర్తి ఇమర్సివ్ అనుభవాన్ని అందిస్తుంది. చుట్టూ కనిపించే విజువల్స్ ద్వారా, సందర్శకులు నిజంగా ఆ అనుభవంలో ఉన్నట్టు భావిస్తారు. రోజంతా వివిధ షోలు ప్రదర్శించబడతాయి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 14, 2026 వరకు వైల్డ్ వాటర్స్ సమ్మర్ ఫెస్ట్ నిర్వహించనుందని తెలిపారు. కిలారు అదితి మాట్లాడుతూ ఈ కొత్త ఆకర్షణలతో, వైల్డ్ వాటర్స్ సాంకేతికత, వినోదం, కుటుంబానికి అనుకూలమైన అనుభవాలను కలిపి పూర్తి రోజంతా వినోదాన్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఒకే టికెట్‌తో సందర్శకులు ఆస్వాదించగల వినోదాలు:
50కి పైగా వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ రైడ్స్. లైవ్ డాన్స్ షోలు అండ్ డీజే ప్రోగ్రామ్స్, వేవ్ పూల్ అనుభవం, మ్యాజిక్ షోలు, విభిన్న రకాల ఆహార వసతులు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా డీజే ఫోమ్ పార్టీను కూడా ప్రవేశపెట్టారు, ఇది వేసవిలో సందర్శకులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది.






