20 May, 2026 | 5:33 PM

30 ఏళ్లుగా మండల కేంద్రం ప్రజల దాహార్తి తీర్చుతున్న నీటి దాత

20-05-2026 05:02 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని దాదాపు 200 ఇండ్లకు త్రాగునీటి ఎద్దడి ఏర్పడడంతో గ్రామానికి చెందిన వసంతరావు సూర్య 30 సంవత్సరాలుగా నీటి దాతగా నిలిచారు. తనకు ఉన్న బోరుబావిలో నీరు పుష్కలంగా ఉండడంతో ప్రజల గొంతు తడిపేందుకు ముందుకు వచ్చారు. గ్రామం చుట్టూ ఉన్న వాగు ఎండిపోవడంతో గ్రామంలో త్రాగునీటి ఎద్దడి తీవ్రమైంది ఫలితంగా ప్రజలు నీటి కోసం అల్లాడడం చూసి వసంతరావు నీటిని అందించాలని నిర్ణయించుకున్నారు.

భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులన్నీ ఎండిపోయిన ఈయనకు ఉన్న బోరు బావిలో మాత్రం మీరు పుష్కలంగా ఉంది. గ్రామస్తుల కు నీటి ఎద్దడి లేకుండా చేయూతని ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు రావడంతో మండల కేంద్రంలోని ప్రజలు ఈయన సేవ నిరతిని అభినందిస్తున్నారు.