29 July, 2026 | 9:13 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

రోడ్డుపై ప్రస్తారోకో నిర్వహించిన రైతులు

20-05-2026 05:05 PM

రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట మండలం కోమటిపల్లి ఐకెపి కేంద్రం వద్ద రైతుల ఆవేదన రోడ్డెక్కింది. వడ్లు కొనుగోలు చేయకపోవడంతో పాటు రాత్రిపూట ధాన్యం దొంగతనాలు జరుగుతున్నాయంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. కోటిపల్లి ఐకెపి సెంటర్‌కు వడ్లు తీసుకొచ్చిన రైతులు రోజులుగా కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

సెంటర్ వద్ద కాపలా సిబ్బంది లేకపోవడంతో రాత్రిపూట వడ్ల కుప్పల నుంచి ధాన్యం దొంగతనం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లంచం ఇస్తేనే వడ్లు నింపుతున్నారని, లేకపోతే రోజుల తరబడి తిప్పలు పెడుతున్నారని రైతులు మండిపడ్డారు. సమస్య పరిష్కారం కోరుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు రైతులతో చర్చించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.