11 August, 2026 | 5:24 PM

మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే గణప సముద్రం సాగునీటి విడుదల

11-08-2026 04:22 PM

నీటి విడుదలతో ఫలించిన బీఆర్‌ఎస్‌ పోరాటం

బిఆర్ఎస్ నాయకులు కరునాకర్ రెడ్డి, లక్ష్మీనరసింహారావు

గణపురం,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒత్తిడితోనే గణపురం చెరువు కాలువలకు నీటిని విడుదల చేయడం జరిగిందని బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఫలించిందని బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, భూపాలపల్లి మాజీ మార్కెట్‌ చైర్మన్‌ పోలుసాని లక్ష్మీనరసింహారావులు అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గణపురం చెరువు తూముల వద్ద నీటి విడుదలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒత్తిడితోనే అధికారులు చెరువు కాలువల తూములు తెరిచారని తెలిపారు. కాలువలకు నిరంతరంగా సాగునీరు అందించాలని, రామప్ప చెరువు నుంచి దేవాదుల నీటిని గ్రావిటీ కాలువ ద్వారా గణపురం చెరువుకు తరలించాలని డిమాండ్‌ చేశారు.

గతంలో గండ్ర వెంకటరమణారెడ్డి హయాంలో రామప్ప నుంచి గణపురం చెరువుకు గ్రావిటీ కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ ప్రస్తుతం పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రైతులకు నీటి విషయంలో మళ్లీ ఆటంకాలు ఏర్పడితే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పరుశురాంపల్లి సర్పంచ్‌ ఉడుత సాంబయ్య యాదవ్‌, మాజీ సర్పంచ్‌ కట్ల శంకరయ్య, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు హఫీజ్‌, సీనియర్‌ నాయకులు మామిండ్ల సాంబయ్య యాదవ్‌, గాజర్ల చింటూ గౌడ్‌, బోట్ల స్వామి, పాశికంటి రామకృష్ణ, పబ్బ రవీందర్‌ గౌడ్, వేల్పుల రాజయ్య, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.