11 August, 2026 | 5:05 PM

జాతీయ జెండా ఎగురవేసిన బిజెపి నేతలు

11-08-2026 04:34 PM

తాండూరు,(విజయ క్రాంతి): "హర్ ఘర్ తిరంగా" ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా తాండూరు బిజెపి పట్టణం శాఖ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ నాగారం మల్లేశం తన నివాసంపై బిజెపి నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయుడు గర్వంగా ఐక్యతను, దేశభక్తిని చాటుతూ జాతీయ భావంతో తమ తమ ఇంటిపై జాతీయ జెండా ఈనెల 15వ తేదీ వరకు ఎగరవేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఊరడి నారాయణ, మంతటి రాజు, చిదిరి ప్రకాష్, వడ్డే సాయిలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.