27 July, 2026 | 12:54 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

త్యాగాలతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం

04-06-2026 01:36 AM

పవన్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కుమార్తె 

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గద్దరు కూతురు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు.. ఈ రోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు అన్నారు. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదని త్యాగాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం అని ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నామే తప్ప ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదని వెన్నెల పేర్కొన్నారు.