ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు
04-06-2026 01:38 AM
పవన్‌కళ్యాణ్‌కు మంత్రి అడ్లూరి హెచ్చరిక
వెల్గటూర్, జూన్ 3(విజయక్రాంతి): తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హితవు పలికారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ మీ జాగీర అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. నోరు ఉన్నదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఇస్తారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అన్నద మ్ముల్లాగా కలిసి ఉంటున్నారని అన్నారు.






