16-07-2025 01:00:27 AM
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా
కుమ్రంభీం ఆసిఫాబాద్, జులై 15(విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహయ మంత్రి హర్ష్ మల్హో త్రా అన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన లైబ్రరీ , ఇందిరమ్మ మాడల్ హౌజ్ ,తుంపెల్లిలో జల్ జీవన్ మిషన్ ట్యాంక్ ను పరిశీలించారు. లైబ్రరీ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృ ద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు.దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ నాయకత్వంలో విశేష కృషి చేయడం జరుగుతుందన్నారు. వెనుకబాటు దూరం చేసే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా 117 ఆస్పిరేషన్ బ్లాక్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజన ప్రజలకు మెడికల్ ఫెలిలిటీ కూడా మెరుగు కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చొరవతో జాతీయ రహదారులు నిర్మించడం ద్వారా రవాణా వ్యవస్థమెరుగు పడిందని చెప్పారు. దేశం లోని ఆస్పిరేషన్ బ్లాక్ లలో కేంద్ర మంత్రులు పర్యటించి అభివృద్ధి ప్రగతిని ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని ఆదేశాలు ఇచ్చారని అందులో భాగంగా పర్యట న చేస్తున్నట్లు చెప్పారు.జిల్లా కేంద్రంలో పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేయడం ద్వారా స్టూడెంట్స్ కి మేలు జరుగుతుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ లైబ్రరీలో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాం ట్ ఏర్పాటు చేసి రాత్రి వరకు ఓపెన్ చేసి ఉంచేలా చూడాలని కలెక్టర్ కి సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేసి అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారించే లా చర్యలు తీసుకోవాలని అన్నారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసి టాప్ లో ఉంచేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 49 పై స్పందిస్తూ దీనిపై సమగ్రంగా స్టడీ చేసి కేంద్ర ప్రభుత్వం ఏమి చేయగలదో చేస్తామని చెప్పారు.ఈకార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, హరీశ్ బాబు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డెవిడ్, డీఎఫ్‌ఓ నీరజ్ కుమార్ టీబ్రేవాల్ ,కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా ,ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు.