16-07-2025 12:59:43 AM
ఇప్పటి వరకు 2,871 పాట్ హోల్స్ మరమ్మతు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జులై 15 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు చేపడుతున్న రోడ్డు భద్రత చర్యలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటెన్సివ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగంగా పనులు చేపడుతున్నది.
గుర్తించిన 8,380 పాట్ హోల్స్‌లో మంగళవారం నాటికి 2,871 గుంతలకు మరమ్మతులు చేసినట్లు సీఈ మెయింటనెన్స్ సహదేవ్ రత్నాకర్ తెలిపారు. ఇంకా క్యాచ్ పిట్ 94 అటెండ్ చేయగా అందులో 23 క్యాచ్ పిట్ కవర్ రీప్లేస్మెంట్ చేశారు.