calender_icon.png 16 July, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెజాన్‌లో ఒబెన్ రోర్ ఈజెడ్

16-07-2025 01:01:10 AM

ఈవీ అమ్మకాలకు వ్యూహ విస్తరణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): భారతదేశపు ప్రముఖ స్వదేశీ, పరిశోధన, అభివృద్ధి ఆధారిత ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ తన సిటీ కమ్యూటర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, రోర్ ఈజడ్ ఇప్పుడు  అమెజాన్‌లోనూ అందుబాటులో ఉంచింది. ఈ ఆవిష్కరణతో ఒక నమ్మకమైన స్థిరపడిన వేదిక ద్వారా ముఖ్యంగా డిజిటల్ ప్రియు లు, మొదటిసారి ఈవీ కొనుగోలు చేసేవారికి ఈవీ కొనుగోలును ఒబెన్ ఎలక్ట్రిక్ మరింత అందుబాటులోకి తెచ్చింది.

రెండు రకాలు 3.4 kWh, 4.4 kWhతో రోర్ ఈజెడ్ బుకింగ్ ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అసలు ధరపై రూ.20,000 ఆఫర్‌తో ఇవి  వరుసగా రూ.1,19,999, రూ.1,29,999 లకు లభిస్తున్నాయి. ఒబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకురాలు, సీఈఓ మధుమిత అగ్రవాల్ మాట్లాడుతూ..

మారుతున్న  భారతీయ వినియోగదారుల కొనుగోలు తీరుకు అనుగుణంగా అమెజాన్‌లో రోర్ ఈజెడ్ అందుబాటులోకి తేవడం ఒక వ్యూహత్మక చర్య అని చెప్పారు. ఆన్‌లైన్ వేదికల వైపు వినియోగదారులు అధికంగా వస్తున్న వేళ వారిని చేరుకునేందుకు ఈ-కామర్స్ ఒక ప్రత్యక్ష, నమ్మకమైన మాధ్యమంగా నిలుస్తుందన్నారు.