మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
రూ. 50 లక్షలతో నిర్మించిన అహెలే హద్దీస్ ఈద్గా ప్రహారీ గోడను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్ మే 26 : మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మైనారిటీ సంక్షేమ నిధులు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన అహెలే హద్దీస్ ప్రహరీ గోడను ఎమ్మెల్యేప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి, వారి సామాజిక-ఆర్థిక స్థితిగతుల మెరుగుదల కోసం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం మైనారిటీలకు విద్య, ఉపాధి, మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని తెలిపారు. అహెలే హద్దీస్ ఈద్గా అభివృద్ధి కోసం నిర్మించిన ఈ ప్రహారీ గోడ రంజాన్, బక్రీద్ పర్వదినాల సందర్భంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి అభి వృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతికి అవసరమైన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కులు సిరాజ్ ఖాద్రీ, నగర కార్పొరేటర్లు షబ్బీర్, అవేజ్, ఉమర్ కొత్వాల్, అహెలే హద్దీస్ ఈద్గా సభ్యులు సైఫోద్దీన్, ఇసా అమోధి, జాబీర్ బిన్ సయ్యిద్ ఉన్నారు.






