27 May, 2026 | 2:03 AM

హత్య కేసును ఛేదించిన పోలీసులు

27-05-2026 12:29 AM

మంచిర్యాల, మే 26 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సుఫారి హత్య ఘటనకు సంబంధించి కేసును రెండు రోజుల్లో హాజీపూర్ పోలీసులు చేధించారు. మంగళ వా రం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఏ ర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలను మంచిర్యాల డిసిపి ఎగ్గడి భా స్కర్, మంచిర్యాల ఏసిపి ప్రకాష్, మంచిర్యాల రూరల్ సిఐ గోపతి రవీందర్ తో కలి సి వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన సాయి ని కుమార్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన ఘటనలో కొడుకు మరణంపై అతని తల్లి సాయిని లక్ష్మి హాజీపూర్ పోలీస్ స్టేషన్లో (సాయిని కుమార్ భార్య సా యిని భారతికి గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్ తో ఏర్పడిన అక్రమ సం బంధం వల్ల జరిగిన హత్యపై) ఇచ్చిన ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సాయిని కుమార్ అధికం గా మద్యం సేవించడం వల్ల అప్పులు పెరిగి, గుడిపేట గ్రామానికి చెందిన రామ్ మల్లేష్ వద్ద రూ. 60 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు తిరిగి చెల్లించకపోవడంతో మ ల్లేష్ పలుమార్లు కుమార్ ఇంటికి వెళ్లి డ బ్బులు ఇవ్వాలని గొడవ చేశాడు. అప్పు చె ల్లించకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో కుమార్ భార్య భారతికి మల్లేష్తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమ సం బంధానికి దారి తీసింది.

కుమార్ కు ఈ విష యం తెలిసి ప్రతిరోజూ మద్యం సేవించి అక్ర మ సంబంధం విషయంలో భార్యను హిం సించడం మొదలుపెట్టాడు. కుమార్ ని హ త్య చేస్తే తమ అక్రమ సంబంధానికి అడ్డంకి తొలగిపోతుందని భావించి భారతి, సురేందర్ కలిసి పథకం పన్నారు. కుమార్ పేరిట పలు జీవిత బీమా పాలసీలు తీసుకుని, కు మార్ ని చంపేందుకు రామ్ మల్లేష్ తో రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, 2026 ఏప్రిల్ నెలలో రూ. 2 లక్షలు ముందస్తుగా చెల్లించారు.

మల్లేష్ ఒక్కడే హత్య చేయలేనని భావించి, శ్రీరామ్ కుమార్ను స హకారానికి ఒప్పించుసుకొని పథకం ప్రకా రం ఈ నెల 22న రాత్రి ముల్కల్ల గ్రామ శి వారులో కుమార్ కు అధిక మోతాదులో మ ద్యం తాగించి, ఇనుప సుత్తితో తలపై బ లంగా కొట్టి హత్య చేశారు. అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని, మోటార్ సైకిల్ను రోడ్డుపై పడవేసి పరారయ్యారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేపట్టి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతోహత్యను చేదించి రామ్ మ ల్లేష్, శ్రీరామ్ కుమార్, సాయిని భారతి, లగిశెట్టి సురేందర్ లపై కేసు నమోదు చేసి అ దుపులోకి తీసుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, హాజీపూర్ ఎస్త్స్ర కిరణ్ కుమార్ ఎస్‌ఐ,తదితలు పాల్గొన్నారు.