03-12-2025 12:00:00 AM
రంగారెడ్డి, డిసెంబర్ ౨ (విజయక్రాంతి ): స్థానిక ఎన్నికలవేళ కొత్త గా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారి పంట పండింది. ఎలక్షన్లకు మద్యం కు విడదీయరాని బంధం ఉంది... ఎవరు అవునన్నా... కాదన్నా ఓటర్లను ప్రభావితం చేయడంలో మద్యం కూడా కీలకపాత్ర పోషిస్తుందనడం లో అతిశయోక్తి లేదు. అందులో స్థానిక ఎన్నికలు... పంచాయతీలు, వార్డుల స్థానాలకు ఎన్నికలు జరు గుతున్నాయి.
పల్లెలన్నీ ప్రస్తుతం పంచాయతీ పోరు తో వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారికి డిసెంబర్ ఫస్ట్ నుంచి వ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటును కల్పించింది. కొత్తగా మద్యం పాలసీ ప్రారంభ మయ్యే సమయానికే సర్పంచ్ ఎన్నికలు రావడం తో వ్యాపారుల కళ్ళల్లో ఆనందాలు వెళ్లి విరుస్తున్నాయి. ఇక్కడి నుంచి వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, జిహెచ్‌ఎంసి ఎన్నికలు రానున్నాయి.
కొత్తగా మద్యం దుకాణాల దక్కించుకున్న వారికి ఈ రెండేళ్లు (2025-27) వారి పంట పండినట్టే. ఎలక్షన్లో సీజన్లో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరజిల్లుతుంది. ఎన్నికల సమయంలో పారే మద్యం బహిరంగ రహస్యమే.. ఇందులో ఎక్కడ దాపరికం లేదు. అయితే ఎన్నికల నిబంధనలను అనుసరించి.. ఆయా పార్టీల అభ్య ర్థులు కొనుగోలు చేసిన మద్యాన్ని బహిరంగపరచకుండా.. గుట్టుగా పంపకాలు చేపడ తారు. మరో పక్క పండుగ పర్వదినాలు, కొత్త ఏడాది ఉత్సవాలు ఇలా దుకాణాల గడువు తిరేలోగా జిల్లా లో వైన్స్ షాపు లకు కాసుల గలగలలు తప్పవు.
30తో ముగిసిన గడువు..
గతంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు లైసెన్స్ గడువు నంబరు 30తో ముగిసింది. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ రెండేళ్ల కాలపరిమితి కోసం నోటిఫికేషన్ జారీ చేసి టెండర్లు పిలిచి డ్రా పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయించింది. జిల్లా లో మొత్తం 249 మద్యం దుకాణాలు ఉన్నా యి. ఇందులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయ తీల లో జనాభాకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది.
కొత్తగా డ్రా పద్ధతిలో మద్యం టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు అధికారికంగా ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొంది వ్యాపారాలు ప్రారంభించారు.జిల్లా పరిధి లో రెండు ఎక్సైజ్ డివిజన్ లు శంషాబాద్, సరూర్‌నగర్‌లు ఉన్నాయి. శంషా బాద్ పరిధిలో 111, సరూర్నగర్ పరిధిలో 138 మద్యం దుకాణాలు ఉన్నాయి. వ్యాపారులకు ఈ దఫా అదృష్టం వరించిందని చెప్పాలి. ఇప్పటికే పలువురు మద్యం వ్యాపారులు గతంలో లీజు తీసుకున్న దుకాణాలను మళ్లీ లీజు డీడ్ చేసుకొని అక్కడే దుకాణా లను ప్రారంభించి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరికొందరు... దుకాణాల ఏర్పాటుకు సరైన అడ్డాల దొరక కా... ఉన్న స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత ఇలా పలు కారణాల చేత దుకాణాలను ప్రారంభించలేకపోయారు. దానికి తోడు ప్రభుత్వ నియమ, నిబంధనలు ప్రకారము విద్యాసంస్థలు మసీదులు, గుడులు, చర్చిలు ప్రార్థన స్థలాల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఎలాగు ఉంది. దీంతో వ్యాపారం అనుకూలంగా ఉండే ప్రదేశాల లో నే మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు సిద్ధం చేసుకునే పనులో ప్రస్తుతం నిమగ్నమయ్యారు.