28 July, 2026 | 1:46 AM

మనసు పెట్టి ఆలోచించండి.. మంచి చేస్తున్నాం

28-07-2026 12:50 AM

పబ్లిసిటీ కాదు.. భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నాం 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, జూలై 27 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ మనసుపెట్టి ఆలోచించాలని భవిష్యత్తు తరం బాగుపడేలా గొప్ప లక్ష్యంతో మంచి పనులు చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. సోమవారం నగరంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు రూ 15 లక్షలతో శాస్త్ర చికిత్స పరికరాలు, గొల్ల బండ తండాలో రూ 20 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ షెడ్డు ప్రారంభం, ఎంవీఎస్ కళాశాల రూ 20 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడ ప్రారంభంతో పాటు మహిళా సంఘాల స భ్యుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేయడానికి తయారు చేస్తున్న స్కూల్ యూనిఫాంలను ఎమ్మెల్యే పరిశీలించారు.

పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సహాయ మంత్రి హోదా రావడంతో ఎమ్మెల్యేను ప్రత్యేకంగా స న్మానించారు. డివిజన్ 47 లో వోల్టేజ్ సమస్యతో సతమవుతున్న ప్రజల సమస్యలు ప రిష్కరిస్తూ నూతన ట్రాన్స్ఫర్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పనిలోనూ పరిపక్వత కనపరుస్తూ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకుపోతున్నామని స్ప ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గు మ్మల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముఖ్యప్రజా ప్రతినిధులు, తదితర ప్రముఖులు హాజరయ్యారు.