‘సతీ లీలావతి’గా..
వైవిధ్యమైన ప్రాతలతో కథానాయకిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో మరో చిత్రం వస్తోంది. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమా పేరు ‘సతీ లీలావతి’. ‘భీమి లీ కబడ్డీ జట్టు’, ‘ఎస్‌ఎంఎస్ మనసులో శృతి’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య దీన్ని తెరకెక్కించనున్నారు.
నాగమోహన్‌బాబు ఎం, రాజేశ్ టీ నిర్మించను న్నారు. డిసెంబర్ 15న లావణ్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్.. ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడం ద్వారా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసింది. ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య విభిన్న పాత్రలో మరోసారి ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమయ్యారు.
త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్; మాటలు: ఉదయ్ పొట్టిపాడు; ఆర్ట్ డైరెక్టర్: కోసనం విఠల్; ఎడిటర్: సతీశ్ సూర్య.






