28-10-2025 12:23:46 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
యాదాద్రి భువనగిరి అక్టోబర్ 27 ( విజయక్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలో 10 కోట్ల రూపాయలు వయ్యంతో తహసీల్దార్, యం పిడిఓ, పోలీస్ భవనాలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. సోమవారం మోటకొండూర్ మండలంలో వివిధ పనులకు భూమి పూజ కార్యక్రమం లో పాల్గొని ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..
మోటకొండూర్ మండలంలో నూతన భవనాల శంకుస్థాపనలే కాకుండా దాదాపు 250 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగిందని టెండర్లకు కూడా పిలవడం జరిగింది. మోటకొండూర్ మండలానికి వివిధ గ్రామాల నుండి డబుల్ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. కొలనుపాక బ్రిడ్జి పనులు కూడా మొదలు అయ్యాయన్నారు.
చెరువులు నింపేందుకు కాంట్రాక్టర్లు మధ్య లో వదిలి పెట్టి పోతే ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయిలయ్య మిషన్‌లు పెట్టించి 90 చెరువులు నింపి రైతులకు సాగు నీరు అం దించిన ఘనత బీర్ల ఐలయ్య అని అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్ల వచ్చే విధంగా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రజాపాలనలో బాగంగా ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు పంపి ణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు.
ప్రతి లబ్ధిదారునికి 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఆలేరు నియోజక వర్గం అభివృద్ధిలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు ఎం. పి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...గత 10 సంవత్సరాలుగా కొత్త జిల్లాల కొత్త మండలాలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కానీ ప్రజలకు మండలాల్లో ఏ సమస్య వచ్చిన అధికారులు ఉండి పరిష్కరించాలంటే భవనాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు.
ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన పేద ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మోటకొండూరు మండలంలో తహసీల్దార్, ఎం. పి.డి. ఓ, నూతన భవనాలకు ఇవ్వాళ్ళ భూమి పూజ చేసుకోవడం జరిగింది. పత్తి కొనుగోలులో రైతులు ఇబ్బంది పడుతున్నరని గుర్తించి వెంటనే అధికారులతో జిల్లా అధికారులకు మంత్రి తగు సూచనలు, సలహాలు తెలియజేయడం జరిగింది.
జిల్లా కలెక్టర్ వేకుప్ కాల్ లో బాగంగా పదవ తరగతి విద్యార్థుల ఇంటికి వెళ్ళి విద్యపై ప్రత్యేక చొరవ చూపారన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ....60 ఏళ్ల పోరాటం తెలంగాణ కోసం నీళ్ళు, నియామకాలు, నిధులు, కొరకు రాష్ట్రాల విభజన చేయడం జరిగింది.గత ప్రభుత్వం 10 సంవత్సరం లో చేయని అభివృద్ధి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరం లో చేశామన్నారు.
గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసింది కానీ అధికారులు అక్కడ ఉండి పరిష్కరించడానికి భవనాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి గొప్ప ఆలోచన చేసి ప్రజా పాలన వచ్చిన తర్వాత 10 కోట్లతో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ నూతన భవనాలకు శంకుస్థాపనలు చేపట్టడం జరిగింది.
వచ్చే ఏడాది లోపు మోట కొండూరు మండలంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు, పిఎసిఎస్ బ్యాంకు ఏర్పాటు కొరకు మంత్రిని కోరారు. రాష్ట్రంలో ఎక్కువగా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలోనే 350 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇప్పుడు మరో 50 ఇండ్ల పత్రాలు లబ్ధిదారులకు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కొత్తగా పెళ్లయిన, పిల్లలను రేషన్ కార్డులో చేర్పించాలన్న, ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవాలన్న రేషన్ కార్డు ప్రతి పేదవారికి అవసరమని ప్రజా ప్రభుత్వం ఆలోచించి ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలనే సంకల్పనతో నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ... మోటకొండూర్ మండలానికి తాసిల్దార్ , ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ నూతన భవనాల ఏర్పాటుకు 10 కోట్లు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలన్నారు. గతంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు భవనాలు లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారని కొత్త భవనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు.
ప్రజల సమస్యలు అందుబాటులో ఉంటూ పరిష్కరించేందుకు మంత్రి సూచనల మేరకు నూతన భవనాలు 6 నెలల్లో పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తామన్నారు. అనంతరం మోటకొండూరు మండలానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు అందజేశారు. తదుపరి మోటకొండూర్ మహిళ సంఘా లకు మహిళ సమైక్య ద్వారా 13.73 కోట్ల చెక్కును మంత్రి అందజేశారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, విమల వెంకటేష్, భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి, పిడి డిఆర్డిఏ నాగిరెడ్డి, పిడి హౌసింగ్ విజయ సింగ్, ఎమ్మార్వో ,దివ్యవాణి, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.