calender_icon.png 28 October, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు జూబ్లీహిల్స్‌లో బీజేపీ మహాపాదయాత్ర

28-10-2025 12:22:01 AM

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): నేడు బీజేపీ మహా పాద యాత్రను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టనుంది. మంగళవారం చేపట్టే మహాపాదయాత్రతోపాటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ లు, మాజీ మంత్రులు, కీలక నేతలతోపాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ మహాపాదయాత్ర బస్తీలు, కాలనీల గుండా వెళ్తోంది. గెలుపు లక్ష్యంగా ఈ యాత్రను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. గడపగడపకూ వెళ్తూ ప్రతి ఓటరునూ కలిసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లు విడతల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.