calender_icon.png 28 October, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేస్తాం

28-10-2025 12:25:34 AM

  1. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఇది రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

యాదాద్రి భువనగిరి అక్టోబర్ 27 ( విజయక్రాంతి ): రైతుల పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు  ధాన్యం, పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, రోడ్లు, భవనాలు,  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ మీటింగ్ హల్ లో ధాన్యంకొనుగోలు ,పత్తి కొనుగోలు కేంద్రాల పై సమీక్ష సమావేశంలో భువనగిరి ఎం. పి చామల కిరణ్ కుమార్ రెడ్డి,ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత రావు,  రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఏ.సి. పి రాహుల్ రెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడు తూ జిల్లాలో 329 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా లో సుమారు 3. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం అంచనా వేయడం జరిగిందని, అలాగే పత్తి కూడా 90 లక్షల క్విం టాల పత్తి వస్తుందని అంచనా వేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల న్నారు. ఇప్పటి వరకు ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని సంబంధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  రైతులు పండించిన ధాన్యాన్ని  కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వెంటనే కాంటావేసి వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ప్రభుత్వం తరఫు నుండి టార్పలిన్  ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇంకో రెండు, మూడు రోజు లు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యం విషయంలో  జాగ్రత్త వహించాలన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

తేమ శాతం వచ్చిన ధాన్యం కుప్పలను ఎప్పటికపుడు నైట్ కూడా హమాలీ లతో పని చేయించి తూకం వేసి లారీ లో లోడ్ చేసి సంబంధిత మిల్లుల కు పంపించాలి అన్నారు. ఎటువంటి అలసత్వం వహించరాదన్నారు. కొనుగోలు కేం ద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండటానికి వీలు లేదని అన్నారు . ధాన్యం వచ్చిన వెంటనే  రెండు పూటలా లోడింగ్ చేసి ఎప్పుడు వచ్చిన ధాన్యాన్ని అప్పుడే పంపాలన్నారు.

రైతులు టార్పలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మిల్లర్లు  ధాన్యం సేకరణ విషయం లో ఇబ్బందులు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీనాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా  సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరి కృష్ణా, సివిల్ సప్లై అధికారి రోజా రాణి, వ్యవసాయ అధికారి రమణారెడ్డి  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.