14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేశాం

10-07-2024 05:25:26 AM

సుప్రీంకోర్టుకు తెలిపిన పతంజలి అయుర్వేద

ముంబై, జూలై 9: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తమ 14 ఉత్పత్తుల తయారీ లైసెన్సులను రద్దుచేసినందున, వాటి అమ్మకాలను నిలిపి వేశామని యోగగురు రాందేవ్ బాబా, ఆచా ర్య బాలకృష్ణ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద తాజాగా సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆ ఉత్పత్తులను తొలగించాలని తమ 5,606 ఫ్రాంఛైజి స్టోర్లను కోరామంటూ న్యాయమూర్తులు హిమాకొహ్లి, సందీప్ మెహతా లతో కూడిన సుప్రీం బెంచ్‌కు పతంజలి తెలిపింది. నిషేధిత ఔషధాల ప్రకటనలను మీడియా ప్లాట్‌ఫాంల నుంచి తొలగించినట్టు రెండు వారాల్లో అఫిడవిట్ సమ ర్పించాలని కంపెనీని సుప్రీం ఆదేశించింది. వినియోగదారులను తప్పుదోవపట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారన్న కారణం గా పతంజలికి చెందిన 14 ఉత్పత్తుల తయా రీ లైసెన్సును ఏప్రిల్ నెలలో ఉత్తరాఖండ్ ప్రభు త్వం రద్దుచేసింది.