16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పొగాకు రహిత సమాజాన్ని నిర్మించాలి

01-06-2025 01:20 AM

- నిమ్స్ నెఫ్రాలజీ డాక్టర్ భూషణ్ రాజు

ఖైరతాబాద్, మే 31 (విజయక్రాంతి): పొగాకు రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిమ్స్ నెఫ్రాలజీ డాక్టర్ భూషణ్ రాజు పిలుపునిచ్చారు. ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో డాక్టర్ రావుస్ ఓరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై  ఏఐజీ హాస్పిటల్ వైద్యులు విశ్వనాథ్ జెల్ల, చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ నాగేశ్వరరావు, కోఆర్డినేటర్ కుసుమ భోగరాజులతో కలిసి మాట్లా డారు.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గత నెల రోజులు నగరం మొత్తం వివిధ కార్యక్రమాలను నిర్వహించి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే కష్టా లపై డాక్టర్ నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీ యమని తెలిపారు . పొగాకు ఉత్పత్తుల్లో 7 వేల విష ప దార్థాలు ఉండటం వల్ల అవి మానవ శరీరంలోకి వెళ్లి 69 రకాల ప్రాణాంతక వ్యాధులను కలగజే స్తున్నాయని వివరించారు. పొగాకు వాడకం ద్వారా దేశంలో ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారని తెలిపారు.

అలాంటి పొగాకు సేద్యాన్ని పూర్తిగా నిషేధించి రైతులకు ప్రత్యా మ్నాయ మార్గాన్ని చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాల ఫలితంగా గతంలో ఉన్నంతగా పొగాకు వాడకం ఇప్పుడు లేదన్నారు. అయితే, కొంతమంది సినిమాల్లో చూసి పొగాకు ఉత్పత్తులను వాడడం ఫ్యాషన్ గా మార్చుకుంటున్నారని తెలిపారు. బీడి, సిగ రెట్, చుట్ట, గుట్కా వాడకంతో అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయని అన్నారు.