16 April, 2026 | 11:57 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పండల హరినాథ్‌గౌడ్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు-

01-06-2025 01:18 AM

ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): వైద్య రంగంలో 35 ఏళ్లుగా సీనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా ఎనలేని కృషి చేసిన పీ హరినాథ్‌గౌడ్ పదవీ విరమణ సందర్భంగా లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు- 2025ను ప్రదానం చేశారు.

శనివారం ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ (టీసీసీ) రాష్ట్ర శాఖ ముఖ్య కో-ఆర్డినేటర్ జీ వేణుగోపాల్ పీసీసీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు కాశమాని షాంరావ్ ముదిరాజ్ తో కలిసి ఘనంగా సన్మానించారు. అమెరికా పర్యటనలో ఉన్న టీసీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు పవన్‌రెడ్డి, టిఎన్జీవోస్ ఉపాధ్యక్షులు మాచర్ల రవీందర్, కొత్త మనోహర్ ముదిరాజ్, మానిక్ రావ్, కిష్ట య్య, సరూర్ నగర్ దవాఖాన వైద్య సిబ్బం  ది సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.