మంచి నాయకులను ఎన్నుకోవాలి
మానవ హక్కుల కార్యకర్తల అసోసియేషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్‌టిఐ, మానవ హక్కుల కార్యకర్తల అసోసియేషన్, ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్, పరిశ్రమలు తదితర సంస్థలను మూసివేసి, కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అలాగే, ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుని, ప్రజాస్వామ్యంపై, రా జ్యాంగంపై నిబద్ధతతో, ప్రజా సమస్యలపై స్పందించే మంచి నాయకులను ఎన్నుకోవాలని అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆదివా రం విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ ఆక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ చైర్మన్ అజయ్ కుమార్, ప్రెసిడెంట్ ధారా మౌనిక, జనరల్ సెక్రటరీ వెం కట్ నర్సింహారెడ్డి, ఆర్టీఐ అండ్ హ్యూ మన్ రైట్స్ హెడ్ పోచయ్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.






