1 June, 2026 | 1:44 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలి

01-06-2026 12:53 AM
  1. గోషామహల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు 
  2. ప్రత్యేక ఇంచార్జ్ గోండ్ల నాగేందర్ గౌడ్

ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి):  రాబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్త లపై ఉందని టిఎస్‌ఈ డబ్ల్యూఐడిసి మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రత్యేక ఇంచార్జ్ గోండ్ల నాగేందర్ గౌడ్  పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం గోషామహల్ నియోజకవర్గ పార్టీ నాయకులు,  కార్యకర్తల సమావేశం మాజీ గ్రంథాలయ సంస్థ  గడ్డం చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా గోం డ్ల నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ ఐక్యత తో ఉండి రాజకీయంలో విభేదాలు వీడి వేరే పా ర్టీ వారితో రాజకీయ పరంగాఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసి  బీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో గోషామహల్ అసెంబ్లీ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి ఆర్.వి.మహేందర్, మాజీ గ్రంథాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, వివిధ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, హుస్సేన్, శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్‌గౌడ్, బి.శ్రీనివాస్, మహిళా నాయకు రాలు శాంతిదేవి తదితరులు పాల్గొన్నారు.