1 June, 2026 | 1:26 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను సందర్శించిన బీజేపీ నేతలు

01-06-2026 12:55 AM

సాయినగర్‌లో పర్యటించిన కమలనాథులు

సికింద్రాబాద్, మే 31 (విజయక్రాంతి): సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లా లాపేట సాయినగర్‌లోని డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లను బిజెపి నాయకులు శనివారం సందర్శించారు. దశాబ్దకాలంగా కొనసాగుతున్న  నిర్మాణ పనుల్లో ఇంకా ఇంకా అసం పూర్తిగా ఉన్న పనులను పునరుద్ధరించేందుకు ఇటీవల దిశా కమిటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన డ్రైనేజీ పైపులైన్ పనులను ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా దిశా కమిటీ సభ్యురాలు శారద మల్లేష్‌తో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురా లు బండ కార్తిక చంద్రారెడ్డి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలుగా నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగిస్తూ లబ్ధిదారులకు అందజేయడంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. తాను మాత్రం మంత్రి గా డిప్యూటీ స్పీకర్ గా ప్రస్తుతం ఎమ్మెల్యేగా అధికారాన్ని అనుభవిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కట్టుకున్నారు కానీ ప్రజలు నివసించే ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడంలో మాత్రం పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న  రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ ఇండ్ల నిర్మాణ పనుల ను పట్టించు కోలేదన్నారు.

ఒకవైపు రాష్ట్ర ఆవిర్భావం రోజు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అంటూ ప్రకటనలు ఇస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఇండ్ల నిర్మా ణ పనులు ఇంకా పూర్తి కాలేదు అనడానికి సాయి నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులే నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వెంటనే ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు మేకల సారంగపాణి, కె.నాగేశ్వర్ రెడ్డి,వెంకటేష్ గౌడ్,వేణు యాదవ్,అనిత,రవి ప్రసాద్ గౌడ్, తార్నాక డివిజన్ అధ్యక్షులు ఉపేందర్ యాదవ్, సాయి నగర్ డబుల్ బెడ్ రూం కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.