జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు నడుంబిగించాలి
కాగజ్‌నగర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని చింతగూడ చౌరస్తా లో కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘననం గా నిర్వహించారు.వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలవేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ చింతగూడ చౌరస్తాకు బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాగా నామకరణం చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు.
అలాగే చింతగూడ చౌరస్తా అభివృద్ధికి రూ. 50 లక్షల నిధులు కేటాయించామని, త్వరలో పనులు ప్రారంభించి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.పట్టణంలోని ప్రధాన రోడ్ల వెడల్పు కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రజలు వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రజలందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, మున్సిపల్ చైర్మన్ సాహిన్ సుల్తానా, మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు ఈర్ల విశ్వశ్వర రావు అలియా బేగం, గజ్జెల లావణ్య, చిప్పకుర్తి శ్రీనివాస్, కచ్చకాయల జ్యోతి, సుభాష్, జయదేవ్ పాల్గొన్నారు.




