6 April, 2026 | 2:46 AM

దళితుల అభ్యున్నతికి జగ్జీవన్‌రామ్ కృషి

06-04-2026 12:17 AM

జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు  ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ... దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని, దేశ ఉప ప్రధానిగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం గురించి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా కొమరం భీం జిల్లా  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ నివాళ్లు అర్పించారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.