27 July, 2026 | 7:50 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలి

06-06-2026 12:00 AM

జడ్జి వినీల్ కుమార్

బిచ్కుంద, జూన్ 5 (విజయక్రాంతి): సమాజములో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలని బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వినీల్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలోని కోర్టు ఆవరణలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ మానవ మనుగడకు, భవిష్యత్తు తరాల సంక్షేమానికి ప్రకృతిని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వాడటం, విద్యుత్తును ఆదా చేయడం మరియు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మణ్, రాథోడ్ మనోజ్, విశ్వనాథ్, మల్లేష్, మొహమ్మద్, ప్రకాష్ మరియు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.