27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

నంబర్ ప్లేట్ల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్

06-06-2026 12:00 AM

20 వాహనాల గుర్తింపు.. నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించిన పోలీసులు

సిరిసిల్ల, మే 5 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబర్ ప్లేట్ తొలగింపు, నంబర్ ప్లేట్ మార్ఫి్ంప ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా 20 వాహనాలు గుర్తించి జరిమానా విధించి,ఆయా వాహన యజమానుల ఆధ్వర్యంలో నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. వాహనాలకు నంబర్ ప్లేట్ తొలగించి లేదా నంబర్లు స్పష్టంగా కనిపించకుండా మార్ఫింగ్ చేసి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి వాహనదారుడు తన వాహనానికి నంబర్ ప్లేట్ను స్పష్టంగా కనిపించే విధంగా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సరైన నంబర్ ప్లేట్లు ఉండటం వల్ల దొంగిలించబడిన వాహనాలను గుర్తించడం, నేరాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు. వాహనదారులకు గమనికగా, నంబర్ ప్లేట్ లేకుండా, నంబర్ ప్లేట్కు అడ్డుగా వస్తువులు ఏర్పాటు చేసి, లేదా నంబర్లు పూర్తిగా కనిపించకుండా, సగం నంబర్లు తొలగించి వాహనాలు నడిపితే చీటింగ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సి.ఐ  వెంట ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.